(Local) Sun, 20 Oct, 2019

అంత అహంకారమెందుకు....నాగార్జున

August 24, 2019,   5:18 PM IST
Share on:
అంత అహంకారమెందుకు....నాగార్జున

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న తీరు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పిస్తోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే షో ఒక ఎత్తయితే శని ఆదివారాలలో నాగార్జున వచ్చి బిగ్ బాస్ ఇంటి సభ్యులని నవ్విస్తూనే వారు ఆ వీక్ లో చేసిన తప్పులను సుతిమెత్తగా మందలిస్తూ వారికీ వార్నింగ్ ఇచ్చే విధానం వల్ల ఏమో శని, ఆదివారాలు బిగ్ బాస్ ఎవరు మిస్ చేయకపోవడానికి కారణం. తాజాగా స్టార్ మా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో.... ఐదో వారంలో ఉన్న హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం అలీకి గట్టిగానే క్లాస్‌ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్‌ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగ్‌ గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అలీరెజా, బాబా భాస్కర్‌ల తీరును నాగార్జున ఎత్తిచూపుతున్నాడు. అంత అహంకారమెందుకు? ఆడపిల్ల కెప్టెన్‌ అయితే మాట వినవా? అంటూ అలీరెజాను ప్రశ్నిస్తున్నాడు? ఇక బాబా భాస్కర్‌ విషయాన్ని కూడా నాగ్‌ లేవనెత్తగా.. కామెడీగా చేసేందుకు ప్రయత్నించిన బాబానుద్దేశించి.. ఇది కామెడీ కాదు సీరియస్‌ అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా నాగ్‌ క్లాస్‌ పీకాడా లేదా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి మరి..... 

సంబంధిత వర్గం
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?
ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా...?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.