(Local) Thu, 21 Nov, 2019

“సాహో” తో ప్రారంభమవుతున్న అతిపెద్ద మల్టీప్లెక్స్‌

August 29, 2019,   12:51 PM IST
Share on:
“సాహో” తో ప్రారంభమవుతున్న అతిపెద్ద మల్టీప్లెక్స్‌

ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ గా చెబుతున్న థియేటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరు పేట కు నాలుగు కిలోమీటర్ల దూరంలో పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ లు, 'వీ' సెల్యులాయిడ్‌ పేరిట మూడు స్క్రీన్ల సినీ కాంప్లెక్స్‌ ను నిర్మించారు. రేపు విడుదల కానున్న 'సాహో'తో ఈ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ఇక థియేటర్ విశేషాలను పరిశీలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించారు. ఒక థియేటర్‌ లో ఉన్న స్క్రీన్ వెడల్పు 106 అడుగులు కాగా, నిలువు 94 అడుగులు. ఈ థియేటర్ లో మొత్తం 670 సీట్లు ఉంటాయి. త్రీ డైమన్షన్ సౌండ్‌ సిస్టమ్‌ తో ఉంటుంది. మిగతా రెండు థియేటర్లనూ 180 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 7 ఎకరాల్లో ఈ థియేటర్లు ఉంటాయి. అయితే ఈ థియేటర్ ని ప్రారంభించడానికి సినీనటుడు రామ్ చరణ్ రానున్నట్లుసమాచారం.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.