(Local) Wed, 21 Oct, 2020

సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..

November 28, 2019,   6:17 PM IST
Share on:
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే కేవలం తమిళ తంబీలు మాత్రమే కాక  ప్రపంచ నలుమూలల నుండి ఆయన ఫ్యాన్స్  ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజని పోలీస్ ఆఫీసర్ పాత్రలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ‘దర్బార్’ సినిమా షూటింగ్‌ ముగించేశారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన మూవీ విడుదల కాబోతున్నది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను నిన్న బుధవారం విడుదల చేయగా, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ తన 168వ చిత్రం దర్శకుడు శివతో ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాకు `వ్యూహం` అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ అనుకున్నారు. అయితే, ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కాలా, పేట సినిమాల్లో సీనియర్లను తీసుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారట. దానికిసం కుష్బూను అడిగారని, ఆమెకు రజినితో కలిసి నటించేందుకు ఒకే చేశారని తెలుస్తోంది. గతంలో రజినీతో కలిసి అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్ సినిమాల్లో నటించింది కుష్బూ

సంబంధిత వర్గం
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.