(Local) Mon, 20 Sep, 2021

ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....

November 14, 2019,   3:49 PM IST
Share on:
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....

తమిళ్ స్టార్ హీరో విశాల్ హీరోగా, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్స్ గా సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యాక్షన్'. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని నవంబర్ 15న విడుదల కానుంది. అయితే ఈ యాక్షన్ మూవీ చిత్ర బృందం లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ సినిమా కోసం రానా ఈ పాట పాడినట్టు ఇటీవలే విశాల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సర్ప్రైజ్ నిజం చేస్తూ ఈ రోజు ఆ పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు చిత్రయూనిట్. హిప్ హాప్ తమిళ ఇచ్చిన ట్యూన్ ని రానా వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది. యాక్షన్ మేకింగ్ వీడియోస్ కి ప్యాడింగ్ గా వచ్చిన ఈ సాంగ్ ‘అడుగడుగున పిడుగుల జడి’ అంటూ థ్రిల్లింగ్‌ గా సాగింది.
మొదటి పాటనే ర్యాప్‌ లా పాడిన రానా, అందరినీ ఫిదా చేశాడు. నిజానికి సాంగ్ వినగానే ఇది రానా వాయిస్ యేనా? ఇంత చేంజ్ ఓవర్ ఎలా సాధ్యం అయ్యింది? గంభీరమైన డైలాగ్స్ పలికే గొంతులో ఇంత సూపర్ సాంగ్ వినిపిస్తుందా అనే అనుమానం వచ్చింది. రానా పాడిన ఈ సాంగ్ సినిమాలో ఉంటుందో లేక ప్రొమోషన్స్ కి మాత్రమే పరిమితం అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రొమోషన్స్ కి మాత్రమే ఈ సాంగ్ వాడుతుంటే, ఈ పాటికి ఎప్పుడు సాంగ్ బయటకి వచ్చేది. రిలీజ్ ముందు వదిలారు అంటే రానా గొంతు థియేటర్ లో కూడా వినొచ్చు. తమిళ వర్షన్ కు గాను ఈ ర్యాప్ పాటను ఆది పినిశెట్టితో పాడించారు. కంప్లీట్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది రేపటి వరకు వేచి చూడాలి.

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
సూర్య..‘ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్ రిలీజ్....
సూర్య..‘ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్ రిలీజ్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.