(Local) Mon, 17 May, 2021

బిగ్ బాస్ హౌస్ లో నటి సూసైడ్ అట్టెంప్ట్...!

August 19, 2019,   10:41 AM IST
Share on:
బిగ్ బాస్ హౌస్ లో నటి సూసైడ్ అట్టెంప్ట్...!

ఎక్కడ చుసిన ఎవరి నోటా విన్న ఇప్పుడు వినిపించే మాట బిగ్ బాస్. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో మాత్రమే కాకుండా అధిక స్థాయిలో ఎక్కువ టీఆర్పీ సొంతం చేసుకుంటున్న షో. తెలుగు బిగ్ బాస్ కంటే ముందే తమిళ బిగ్‌బాస్‌ కూడా మొదలయ్యింది. తెలుగుతో పోల్చుకుంటే తమిళ బిగ్ బాస్ ప్రారంభం నుంచీ వివాదాలతో రచ్చ రేపుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ వివాదాలకు నిలయంగా మారిపోయింది. ఏకంగా అందులోని వారిని అరెస్ట్ చేయడనికి పోలీసులు గతంలో వస్తే ఇప్పుడేమో ఏకంగా తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళ హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. తమిళంలో 'ఒరు కల్‌ ఒరు కన్నాడీ' చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న మధుమిత ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ శనివారం అనుకోకుండా ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు సమాచారం. హౌస్‌ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధు మిత చెప్పారట.  దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు.  బయటకు వచ్చిన ఆమె, ఇంట్లోని వారంతా తనను వేధించారని, అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.
 

సంబంధిత వర్గం
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
పులిహోర రాజాకు పునర్నవి షాక్
పులిహోర రాజాకు పునర్నవి షాక్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.