(Local) Sat, 19 Oct, 2019

బికినీ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ !!

September 14, 2019,   6:53 PM IST
Share on:
బికినీ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ !!

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన "శ్రీ" చిత్రంలో మిల్కి భామ తమన్నా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాలలో  స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హోదా దక్కించుకుంది. తాజాగా ఈ మధ్య మిల్కి బ్యూటీ.. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. లేటెస్ట్ గా విశాల్ సరసన యాక్షన్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఏకంగా బికినిలో కనిపించి షాక్ ఇచ్చింది. తమన్నా బికినీ అందాలు టీజర్లో కేకలు పుట్టిస్తున్నాయి. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా బికినిలో అందాలు ఆరబోయడమే కాదు .. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసిందట. ఇందులో తమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారిగా కనిపిస్తుందట. ప్రస్తుతం సౌత్ లో తమన్నా బికినీ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో ఈ అమ్మడు కావాలనే ఇలా గ్లామర్ డోస్ పెంచిందంటూ ప్రచారం జరుగుతుంది.అటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా చిందేస్తూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ సైరా లో కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. తెలుగు, హిందీ భాషల్లో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.