(Local) Sat, 27 Feb, 2021

టబు బర్త్ డే కి ఫస్ట్ లుక్....

November 04, 2019,   12:25 PM IST
Share on:
టబు బర్త్ డే కి ఫస్ట్ లుక్....

1991లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరో వెంకటేష్ సరసన 'కూలీ నెం 1' చిత్రంతో టాలీవుడ్ లోకి తెరంగ్రేటం చేసిన భామ టబు. ఆ తర్వాత తెలుగులో కేవలం అతి కొద్దీ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2008లో బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమాలో అమృత అనే పాత్ర పోషించిన టబు దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులోకి మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత తన వయస్సుకు తగ్గ పాత్రలను ఆమె ఎంచుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలో టబుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్

టబు పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. హ్యాపీ బర్త్‌డే టుబుగారు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు.  అంతేకాక హీరో సుశాంత్ టబు బర్త్ డే కి విష్ చేస్తూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పిక్ షేర్ చేసాడు. 
ఈ లుక్ చూసిన వారంతా టబుకు మంచి మార్కులే ఇస్తున్నారు. ఇక హీరోయిన్‌గా గతంలో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు రీ ఎంట్రీతో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ – పూజా హెగ్డే మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.