(Local) Mon, 26 Aug, 2019

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాప్సి ఫోటోలు

June 09, 2019,   3:48 PM IST
Share on:

 ప్రముఖ హీరోయిన్ తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్ట, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి ఎర్రగా కందిపోయినట్టు కనిపిస్తోంది. తాప్సి ప్రస్తుతం తాను నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ సిన్మా ప్రమోషన్ లో బిజీగా ఉంది. అందులో భాగంగానే ఈ ఫోటోలను రిలీజ్ చేసిందా..? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫొటోకు క్యాప్షన్ గా “మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని 25రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను” అని తాప్సీ తెలిపింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అసలు ఏమి జరిగిందో చెప్పాలని అడుగుతున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.