(Local) Mon, 25 Oct, 2021

భారీ ఎత్తున సైరా.. నరసింహారెడ్డి’ప్రీ రిలీజ్ ఈవెంట్‌

August 25, 2019,   1:02 PM IST
Share on:
భారీ ఎత్తున సైరా.. నరసింహారెడ్డి’ప్రీ రిలీజ్ ఈవెంట ...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ వేడుకను నిర్వహించాలని అనుకున్నప్పటికీ తిరుపతి, విజయవాడ, కర్నూల్ ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక, డేట్ ఖరారైన తర్వాత అధికారికంగా ఈ వేడుక వివరాలను తెలియజేస్తారు.

ఇక ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆహ్వానించారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బిగ్- బి అమితాబ్‌బచ్చన్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొంటారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సైతం ఈ వేడుకకు హాజరవుతారని తెలిసింది. ఇక చిత్ర నిర్మాత రామ్‌చరణ్ ఈ వేడుకను సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. నయనతార, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.

సంబంధిత వర్గం
మోడీతో సైరా...
మోడీతో సైరా...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.