(Local) Mon, 27 Sep, 2021

సైరా కలెక్షన్స్ అదుర్స్...

October 04, 2019,   12:09 PM IST
Share on:
సైరా కలెక్షన్స్ అదుర్స్...

మెగాహీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహ రెడ్డి'. ఈ మూవీ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సైరా మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తో ఐదు భాషల్లో అదరగొట్టేస్తుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. మరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. సైరా తొలిరోజు దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది... తెలుగుతో పాటు హిందీ, ఇతర 3 భాషల్లోనూ సైరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది సైరా. ఓవర్సీస్‌లో 2.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా చూస్తే రెండో రోజు 15 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు ఇప్పటి దాకా అందిన రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇక ఈ వీకెండ్‌కు అది రూ.100కోట్లకు టచ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుందని వారు అంటున్నారు.
 

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.