(Local) Mon, 23 Sep, 2019

అత్తివరదరాజ స్వామి ఆలయంలో...సూపర్ స్టార్ దంపతులు

August 14, 2019,   12:19 PM IST
Views: 105
Share on:
అత్తివరదరాజ స్వామి ఆలయంలో...సూపర్ స్టార్ దంపతులు

తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందిన విషయం అందరికి తెలిసిందే. కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్వతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్వక్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతోంది. తమిళుల ఆరాధ్యదైవంగా... కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ 40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చే స్వామి దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు. అయితే ఈ కాంచీపురం అత్తివరదరాజ స్వామి ఆలయంలో నిన్న అర్థరాత్రి సమయంలో రజనీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. 40 ఏళ్లకు ఓ సారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజ స్వామి నిజ రూప దర్శనం ఈ నెల 17తో ముగియనుంది. ఈ సంద్భంగా రజనీకాంత్.. ఆయన సతీమణి లతతో కలిసి మంగళవారం అర్థరాత్రి స్వామిని దర్శించుకున్నారు. దీంతో.. ఆలయ ప్రధాన పూజారులు ప్రత్యేక పూజలు జరిపారు. మళ్లీ ఈ దర్శనం 2026లో స్వామి దర్శనం ఉంటుంది. దీంతో.. భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్థరాత్రి.. స్వామి వారిని నిజరూప దర్శనంలో దర్శించుకుంటే.. మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

సంబంధిత వర్గం
బెంగళూరు హాస్పిటల్ లో సూపర్ స్టార్.....
బెంగళూరు హాస్పిటల్ లో సూపర్ స్టార్.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.