(Local) Mon, 12 Apr, 2021

‘ఖైదీ ని ' మెచ్చుకున్న సూపర్ స్టార్

November 02, 2019,   4:04 PM IST
Share on:
‘ఖైదీ ని ' మెచ్చుకున్న సూపర్ స్టార్

త‌మిళ హీరో కార్తీ న‌టించిన తాజా చిత్రం ‘ఖైదీ’ చిత్ర యూనిట్ పై సినిమా ప్రేక్షకులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యోత్స‌హాంతో ‘ఖైదీ’ స్వీకెల్ తీయ‌నున్న‌ట్టు కార్తీ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. డైరెక్ట‌ర్ లోకేష్ 30 రోజుల డేట్స్ ఇస్తే చాలు ‘ఖైదీ 2’ తీస్తాన‌న్నారని కార్తీ తెలియ‌చేసారు. ప్ర‌స్తుతం కార్తీ చేస్తోన్న సినిమా అయిన త‌ర్వాత ‘ఖైదీ 2’ ఉంటుంద‌ని చెప్పారు.ఇదిలా ఉంటే… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘ఖైదీ’ సినిమా పై ట్విట్టర్ ద్వారా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌హేష్ మాట్లాడుతూ … ‘ఖైదీ’ ఓ న్యూఏజ్ ఫిల్మ్ మేకింగ్. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రిప్ట్, కళ్లు చెదిరే నటన అదిరింది. పాటలు లేకుండా ఆకట్టుకున్నారు. స్వాగతించాల్సిన ప్రయోగం ఇది అని ‘ఖైదీ’ సినిమా పై ప్రశంసించారు. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తోన్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.