(Local) Sat, 24 Jul, 2021

'కామసూత్ర' వెబ్‌సిరీస్‌లో పోర్న్ స్టార్....?

September 26, 2019,   3:52 PM IST
Share on:
'కామసూత్ర' వెబ్‌సిరీస్‌లో పోర్న్ స్టార్....?

సన్నీలియోన్ ఈ పేరు పరిచయం అవసరం లేదు. పోర్న్ చిత్రాలలో నటించి ఈ భామ తన మకాం బాలీవుడ్ కి షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక అడపాదడపా తెలుగు చిత్రాలలో కనిపిస్తూ ఐటమ్ సాంగ్స్ తో కవ్విస్తోంది. అయితే తాజాగా ఈ పోర్న్ భామకి మళ్ళీ  అవే అవకాశాలు తలుపు తడుతున్నట్టుగానే వుంది. అప్పుడేదో అలాంటి చిత్రాలు చేశాను.. ఇప్పుడు మాత్రం చక్కగా హిందీ సినిమాలు చేసుకుంటానని ఇదివరకే సన్నీ చాలా సందర్భాలలో చెప్పింది. అయితే ఆమెను వెతుక్కుంటూ అలాంటి అవకాశాలే వస్తున్నాయి. కాకపోతే పోర్న్ అంతకాకుండా రొమాన్స్ చిత్రాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే సన్నీ ఏక్తాకపూర్‌ దర్శకత్వంలో రానున్న ‘కామసూత్ర’ వెబ్‌సిరీస్‌లో నటించనుందని తెలుస్తోంది. ఏక్తా కపూర్‌ ‘కామసూత్ర’ ఆధారంగా ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి సన్నీ అయితేనే బాగుంటుందని ఏక్తా భావిస్తోందట. ఈ క్రమంలో సన్నీలియోనీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట. కథ విన్న సన్నీలియోనీ ఇందులో నటించేందుకు సుముఖంగా ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఏక్తాకపూర్‌, సన్నీలియోనీ కలిసి ‘రాగిణి-ఎంఎంఎస్‌2 ‘ చిత్రం కోసం పనిచేశారు. ఇప్పటికే సన్నీ ‘మధుర రాజా’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె ‘వీరమాదేవి’ ‘స్లిట్స్‌విల్లా సీజన్‌ 12’ చిత్రాల్లో నటిస్తోంది. 

సంబంధిత వర్గం
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.