(Local) Sat, 24 Jul, 2021

సుకుమార్, అల్లు అర్జున్ #AA20 సినిమా ప్రారంభం

October 30, 2019,   6:44 PM IST
Share on:
సుకుమార్, అల్లు అర్జున్ #AA20 సినిమా ప్రారంభం

స్టైలిష్ స్టార్ అల్లము అర్జున్, లెక్కల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా బుధవారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్… ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా ఈ చిత్ర షూటింగ్‌ నేడు లాంఛనంగా ప్రారంభమైంది.
‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, కొరటాల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ సంగీతమందిస్తున్నాడు. ఇది బన్నీకి 20వ చిత్రం కావడంతో ‘AA20’అనే వర్కింగ్‌ టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు సమాచారం.    
 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.