(Local) Tue, 22 Sep, 2020

స్టైలిష్ స్టార్ ని మెప్పించిన 'ఎవరు'...

August 19, 2019,   12:17 PM IST
Share on:
స్టైలిష్ స్టార్ ని మెప్పించిన 'ఎవరు'...

క్షణం, గూఢచారి వంటి థ్రిల్లర్ సినిమాలతో హిట్స్ కొట్టిన అడవి శేష్ ఎవరు సినిమాతోనూ హిట్ కొట్టేసాడు. అడవి శేష్ - రెజీనా జంటగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమా గత గురువారం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాక శేష్ కెరీర్ లోనే ఎవరు సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇప్పటికే  ఈ చిత్రం పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంశల వర్షం కురిపిస్తున్న సంగతి విదితమే.  కాగా టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నచ్చిందని చెబుతూ శేష్ కి తన బ్యానర్ లో ఒక సినిమా ఛాన్స్ కూడా ఇవ్వగా, దర్శకేంద్రుడు కూడా సినిమా చూసి ట్విస్ట్ బాగుంది అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఈ సినిమా చుసిన స్టైలిష్ స్టార్ చిత్ర యూనిట్ ని ప్రసంశిస్తు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఎవరు సినిమా టీమ్ కి కంగ్రాట్స్ చెప్పిన ఆయన, గత రాత్రి ఈ సినిమా చూశానని చెప్పుకొచ్చారు. ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ సినిమా, ఈ మర్డర్ మిస్టరీ సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు, మలుపులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా సినిమా బాగా నచ్చినదన్న ఆయన ఈ సినిమా రచనా, సాంకేతిక విభాగాల  వర్క్ కూడా బాగుందని ప్రశంసించారు. శేష్ కి వరుసగా మంచి సినిమాలు పడ్డాయని, ఈ సినిమా హ్యాట్రిక్ అనే చెప్పాలని అన్నారు. అలాగే రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ నటన కూడా బాగుందని బన్నీ ప్రశంసించారు. ఇక పీవీపీకి అలాగే దర్శకుడు రామ్ జీకి కూడా అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పారు.

 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.