(Local) Fri, 22 Oct, 2021

‘ఏ స్వీట్ వార్నింగ్’....‘ఫసక్‌’

August 21, 2019,   10:44 AM IST
Share on:
‘ఏ స్వీట్ వార్నింగ్’....‘ఫసక్‌’

చిన్న పిల్లలు చేసే అల్లరి, తెలిసి తెలియని వయస్సులో వారు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అదే ఆ పిల్లలు చేసే అల్లరిని సోషల్ మీడియాలో పెడితే  లైక్ చేసి షేర్ చేయకుండా అస్సలు ఉండలేము కదా...అదే ఒకవేళ ఆ పిల్లలు సెలెబ్రిటీస్ సంతానం అయితే ఇంకా ఆ వీడియోకి రెస్పాన్స్ ఏ మాత్రంఉంటుందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. సువర్ స్టార్ మహేష్ గారాల పట్టి ఎలా అల్లరి చేస్తూ ముద్దుగా డాన్స్ చేస్తూ ఏ విధంగా మురిపిస్తుందో అందరికి తెలిసిందే. తాజాగా ఇదే కోవలో మరో చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ బుజ్జి పాపాయి ఎవరో కాదు... మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.

అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. తానూ చిన్న పిల్లోడిలా మారి వారితో అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేస్తుంటాడు. తాజాగా తన కూతురితో కలిసి చేసిన అల్లరిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బన్నీ తన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆమెతో ముద్దు ముద్దుగా మాట్లాడించాడు. 'ఓన్లీ వన్స్.. ఫసక్..' అంటూ తన కూతురితో డైలాగ్ చెప్పించాడు. అర్హ కూడా అంతే క్యూట్‌గా 'ఓన్లీ వన్స్.. ఫసక్..' అంటూ బన్నీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ముద్దు ముద్దు మాటలతో అర్హ చెబుతున్న డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇది చూసిన వారంతా ‘ఏ స్వీట్ వార్నింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి అల్లరిని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.
 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.