(Local) Mon, 27 Sep, 2021

రవితేజ 66వ చిత్రంతో త్రి కాంబో రిపీట్

November 05, 2019,   5:10 PM IST
Share on:
రవితేజ 66వ చిత్రంతో త్రి కాంబో రిపీట్

మాస్ మహారాజ రవితేజ డిస్కో రాజా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిస్కో రాజా సినిమా చేస్తూనే రవితేజ మరో చిత్రానికి సైన్ చేసిన సంగతి విదితమే. రవితేజ హీరోగా, శృతిహాసన్‌  హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెరీ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. దీనికి కనకదుర్గ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించాడు. అక్కడ సూపర్ హిట్ అని తెరీని తెలుగులో పోలీసోడు అంటూ తీసుకొచ్చారు. అయితే అంత విజయం సాధించలేదు.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రవితేజతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎస్‌.ఎస్‌.తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రవితేజతో థమన్ కు మంచి అనుబంధం ఉంది. ఈ కాంబినేషన్ లో కిక్ నుంచి మొదలై చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ హీరో చిత్రానికి పాటలు ట్యూన్ చేయబోతున్నాడు థమన్. పైగా మనోడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు ఇప్పుడు. కొన్నేళ్లుగా దూరంగా ఉన్న ఈ కాంబినేషన్ ను ఇప్పుడు గోపీచంద్ మలినేని కలిపాడు.కాగా రవితేజ 66వ చిత్రంతో శృతిహాసన్, తమన్, గోపీచంద్ మలినేని ఈ త్రి కాంబో బలుపు తర్వాత రిపీట్ అవ్వబోతోంది. 

సంబంధిత వర్గం
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం...
ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.