(Local) Fri, 23 Jul, 2021

లండన్‌ రాయల్ అల్బెర్ట్ హాల్‌లో 'బాహుబలి' టీమ్....

October 20, 2019,   10:18 PM IST
Share on:
లండన్‌ రాయల్ అల్బెర్ట్ హాల్‌లో 'బాహుబలి' టీమ్....

తెలుగు సినిమా కీర్తి దేశ ఎల్లలు దాటి, జెట్‌ స్పీడ్‌తో బాహుబలి అనే చిత్రంతో పయనించిన సంగతి తెలిసిందే. జక్కన్న అనేది పేరుకి మాత్రమే కాకుండా  తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి అనే చిత్రంతో చెక్కి మరి ఆ నామానికి సార్ధకత చేకూర్చుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు...బాహుబలి కి ముందు... బాహుబలికి తర్వాత అనే అంతలా తెలుగు సినిమా నిలబడిందని తెలిసిందే. బాహుబలి’ సినిమా వచ్చి నాలుగేళ్లు గడిచిపోయినా దాని క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గడంలేదు. ‘బాహుబలి’ టీం ఎక్కడికి వెళ్లినా వాళ్లపై సినీ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బాహుబలి సినిమా కి ఓ అరుదైన గౌరవం దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు ముందు బాహుబలి ది బిగినింగ్ ప్రదర్శించారు. అంత గొప్ప హాల్ లో ఒక తెలుగు సినిమాను అది తెలుగు లాంగ్వేజ్ లో ప్లే చేయడం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం. ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు ముందు బాహుబలి సినిమాని ప్రదర్శించగా… ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర నటీనటులు ప్రభాస్ రానా అనుష్కల తో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి సాంప్రదాయ దుస్తులు .. పంచెకట్టులో అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ ఆయన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు రాజమౌళి. అయితే లండన్ లో ప్రదర్శించబడే బాహుబలి సినిమా చూడడానికి జపాన్ నుంచి కొంతమంది అమ్మాయిలు రావడం గమనార్హం . వారంతా జక్కన్న తో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

సంబంధిత వర్గం
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.