(Local) Sun, 20 Jun, 2021

మోడీ పై అలిగిన బాలు...

November 05, 2019,   2:56 PM IST
Share on:
మోడీ పై అలిగిన బాలు...

మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమంపై విమర్శల దుమారం చెలరేగుతూనే వస్తోంది. ఇదివరకే ఈ కార్యక్రమం గురించి ఎందుకంత వివక్ష అని అసహనం వ్యక్తంచేస్తూ మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొణిదెల ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమంపై గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మోదీ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో అసహనం వ్యక్తంచేశారు. ‘రామోజీరావుగారి కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని ఎంట్రన్స్‌ దగ్గర మా ఫోన్లు సెక్యూరిటీ వారికి అప్పగించి వెళ్ళమని అన్నారు. మేము అలాగే చేశాం. కానీ మేమంతా లోపలికి వెళ్ళాక కొంతమంది స్టార్లు మాత్రం ప్రత్యేకంగా ప్రధానితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. వారివద్దకు సెల్ ఫోన్లు ఎలా వచ్చాయి అని అడిగితే.. వారంతా జాతీయస్థాయి స్టార్‌లు కావడంతో వారిదగ్గర నుంచి సెల్ ఫోన్స్ తీసుకోలేదు అని సమాధానం వచ్చింది. చాలా బాధగా అనిపించింది’ అని బాలు పేర్కొన్నారు. బాలీవుడ్ తారలు ప్రధానితో సెల్ఫీలు దిగిన కొన్ని ఫోటోలను ఆయన షేర్ చేశారు. 

ఈ కార్యక్రమానికి హిందీ ఫిల్మ్ స్టార్స్‌తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంతమంది సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానం అందిన సంగతి విదితమే

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.