(Local) Fri, 25 Sep, 2020

హీరోని పడేసిన బాలీవుడ్ భామ....!

August 10, 2019,   4:55 PM IST
Share on:
హీరోని పడేసిన బాలీవుడ్ భామ....!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్, రాకేష్ ధావన్ పాత్రలో, మరో అయిదుగురు స్టార్ హీరోయిన్స్ తో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్‘. ఇప్పటికే విదుదల అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేష ఆధారణని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ‘మిషన్ మంగళ ‘ మూవీ ఈ నెల 15 న విడుదలకి సిద్దమవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ కలిసి ముచ్చటలాడుకుంటున్న వేళ.. అక్షయ్ తన కుర్చీలో కాస్త వెనక్కి వాలుదామనుకునేంతలో..  అది గమనించిన సోనాక్షి చిలిపిగా అతని ఛాతీమీద ఎడమచేతిని వేసి వెనక్కి నెట్టేసింది. అంతే.. అంతోటి హీరోగారు కూడా వెనక్కు పడిపోయాడు. ఈ సీన్ చూసి సోనాక్షి మొదట ముసిముసి నవ్వులతో సరిపెట్టింది. తాప్సి, నిత్యా మీనన్, విద్యాబాలన్ కాస్త కంగారు పడ్డారు కూడా.. అయినా సోనాక్షి తన నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేసింది. కిందపడిన అక్షయ్… సోనాక్షి చర్యను లైట్ గా తీసుకుంటూ తానూ ముసిముసినవ్వులు నవ్వాననిపించాడు. తాప్సి మాత్రం.. ‘ ఏంటమ్మా ఇది ‘ ? అంటూ సోనాక్షిని సున్నితంగా మందలించినంత పని చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి ! 

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.