(Local) Sun, 20 Jun, 2021

‘హ్యాపీ మెన్స్ డే’ అంటున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్

November 19, 2019,   8:03 PM IST
Share on:
‘హ్యాపీ మెన్స్ డే’ అంటున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ...

చిత్రలహరి చిత్రంతో ఈ మధ్య విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తుండగా ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  మంగళవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.. ‘‘ఇంటర్నేషనల్ మెన్స్ డే నాడు షూటింగ్ ప్రారంభమైంది.. 2020 మే డే రోజు నుంచి ఫ్రీడం కోసం ఫైట్ స్టార్ట్ కానుంది’’ అంటూ తేజు లొకేషన్‌లోకి ఎంటర్ అవుతున్న వీడియో షేర్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా...2020 మే 1న ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కానుంది. నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.. ‘‘ఇంటర్నేషనల్ మెన్స్ డే నాడు షూటింగ్ ప్రారంభమైంది.. 2020 మే డే రోజు నుంచి ఫ్రీడం కోసం ఫైట్ స్టార్ట్ కానుంది’’ అంటూ తేజు లొకేషన్‌లోకి ఎంటర్ అవుతున్న వీడియో షేర్ చేశారు. 2020 మే 1న ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

సంబంధిత వర్గం
ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల
ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల
‘వెంకీ మామ’ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్న జెమిన ...
‘వెంకీ మామ’ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్న జెమిన ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.