(Local) Mon, 27 Sep, 2021

రవితేజ 66వ చిత్రంలో శృతిహాసన్...

October 31, 2019,   2:25 PM IST
Share on:
రవితేజ 66వ చిత్రంలో శృతిహాసన్...

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా, అందాల భామ సమంత హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘తెరి’. 2016లో విడుదలైన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి 'పోలీస్' పేరుతో విడుదల చేసారు. అయితే తాజాగా ఇదే చిత్రాన్ని తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి డైరెక్టర్ గోపీచంద్ సిద్దమయ్యాడు....రవితేజ 66వ సినిమాగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. 2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్‌.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తోంది.

రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండో చిత్రం ఇది. బలుపులో ఇప్పటికే ఓ సారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

సంబంధిత వర్గం
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘డిస్కోరాజా సాంగ్’
మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘డిస్కోరాజా సాంగ్’

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.