(Local) Mon, 12 Apr, 2021

శ్రద్ధా ఖాతాలో రెండు భారీ హిట్స్!!

September 13, 2019,   12:56 PM IST
Share on:
శ్రద్ధా ఖాతాలో రెండు భారీ హిట్స్!!

సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ అంత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం "సాహో". ఈ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలైన అన్ని బాషలలో మిక్స్డ్ టాక్ తో నడుస్తున్నప్పటికీ అనూహ్యంగా హిందీలో మాత్రం హిట్ మూవీ గా నిలిచింది. బాలీవుడ్ లో ఈమూవీ ఏకంగా రెండు వారాలకు గాను 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ప్రభాస్ మార్కెట్ అక్కడ స్టాండర్డ్ గానే ఉంది. ఈ హిట్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది శ్రద్ద. సాహో లో ఆమె యాక్షన్ సీన్స్ తో పాటు గ్లామర్ తో అలరించింది. ఇక శ్రద్ద నటించిన మరో చిత్రం ఛిచ్చోరే కూడా మంచి విజయం వైపుగా దూసుకెళుతుంది. ఐదురోజులు గాను ఈమూవీ 54 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు హిట్ అవ్వడంతో శ్రద్ద చాలా ఆనందంగా ఉంది. ఇక ఈమూవీ మన తెలుగు హీరో నవీన్ పోలిశెట్టి నటించారు.

సంబంధిత వర్గం
ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్
ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.