(Local) Mon, 12 Apr, 2021

సీత పాత్రకు 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ద...

September 27, 2019,   6:29 PM IST
Share on:
సీత పాత్రకు 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ద...

భారత సినీ పరిశ్రమలోనే కాదు..బుల్లితెరపై ఇప్పటి వరకు రామయణ, మహాభారతం పై ఎన్నో సినిమాలు, సిరియల్స్ వచ్చాయి.  కథ ఒక్కటే అయిన తీసే విధానంలో ఎన్నో మార్పులు చేర్పులతో ఎప్పుడూ ఆకట్టుకుంటునే ఉన్నాయి. ఇలాంటి గొప్ప ఇతిహాసాలను తెరపైకి తీసుకు రావానికి ప్రస్తుతం టెక్నాలజీ వాడుతున్నారు. తాజాగా నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ మూవీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రామాయణంలో రాముడిగా హ్రితిక్ రోషన్ కన్ఫర్మ్ అయ్యాడని... రావణుడిగా ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నారని, సీత పాత్రకి దీపికా ని సంప్రదించగా ఆమె కాదంది కాబట్టి మరో హీరోయిన్ ని సీత కోసం వెతుకుతున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. ఇక సీత పాత్రకి ఈ ఏడాది బాలీవుడ్ లో సాహో తోనూ, చిచ్చోరె సినిమాల్తో హిట్ అందుకున్న శ్రద్ద కపూర్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే రామాయణంలో సీత పాత్రలో నటించడానికి తనకేమి అభ్యంతరం లేదని... కాకపోతే ఆ సినిమా చేసినందుకు తనకి 10 నుండి 12 కోట్ల పారితోషకం కావాలని రామాయణం నిర్మాతలను డిమాండ్ చేసిందట.

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.