(Local) Wed, 02 Dec, 2020

బాలయ్య మూవీ లో బెంగాలీ విలన్....

September 17, 2019,   4:27 PM IST
Share on:
బాలయ్య మూవీ లో బెంగాలీ విలన్....

నందమూరి బాలయ్య 105వ చిత్రం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే "జైసింహ" తర్వాత  ఈ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఈ చిత్రం తెరకెక్కుతోంది. థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో బెంగాలీ నటుడు శతఫ్ ఫిగర్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. ఇలాంటి నటున్ని తీసుకొచ్చారు బాలయ్య కోసం. వినడానికి కూడా పేరు కొత్తగా ఉంది. ప్రస్తుతం శతఫ్ ఫిగర్ హిందీలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన 'మేడ్ ఇన్ చైనా'లో ప్రధాన పాత్రలో నటించాడు. దానికి ముందు 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో హీరో కార్తీక్ ఆర్యన్ తండ్రిగా నటిస్తున్నాడు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'షేర్ షా'లో కీ రోల్ చేస్తున్నాడు ఫిగర్. ఇప్పుడు బాలకృష్ణ కోసం తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాదాచారం. 

సంబంధిత వర్గం
బాలకృష్ణ ‘రూలర్’ టీజర్….!!
బాలకృష్ణ ‘రూలర్’ టీజర్….!!
NBK 105 థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ కంప్లీట్.....
NBK 105 థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ కంప్లీట్.....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.