(Local) Mon, 16 Sep, 2019

ప్రారంభమైన శ‌ర్వానంద్ కొత్త చిత్రం....

August 29, 2019,   11:56 AM IST
Views: 72
Share on:
ప్రారంభమైన శ‌ర్వానంద్ కొత్త చిత్రం....

యంగ్ హీరో శ‌ర్వానంద్ హీరోగా కెరీర్ మంచి జోరు మీద ఉందనే చెప్పవచ్చు. ఈ మధ్య శ్వరా నటించిన రణరంగం విడుదలై సంగతి తెలిసిందే. ప్రస్తుతం '96' రీమేక్‌తో పాటు.. కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డితో 'శ్రీకారం' అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమా మొదలుపెట్టాడు.. శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ తాజాగా కొత్త చిత్రం లాంచ్ చేసింది. ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం : 18గా ఈ మూవీ రూపొందనుంది.  శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్‌లో రీతూ వ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నారు. చెన్నైలో చిత్ర తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ మూవీ కూడా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. 

సంబంధిత వర్గం
రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు....శ్వరా
రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు....శ్వరా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.