(Local) Sat, 19 Oct, 2019

‘హ్యూమన్ కంప్యూటర్’గా ఫస్ట్ లుక్....

September 16, 2019,   1:08 PM IST
Share on:
‘హ్యూమన్ కంప్యూటర్’గా ఫస్ట్ లుక్....

విద్యా బాలన్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు....2019లో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన "ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు " చిత్రం ద్వారా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్న విద్యా బాలన్ ప్రస్తుతం మరో బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'శకుంతలా దేవి- హ్యూమన్ కంప్యూటర్’ అనే బయోపిక్‌లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ లో శకుంతలా దేవిలా విద్య లుక్ అదిరిపోయింది.  చిన్నగా ఉన్న జట్టుతో, ఎరుపు రంగు చీరలో శకుంతలా దేవిగా విద్యా... చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు అను మీనన్ దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ  చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. విద్య బాలన్ కెరీర్ లో ఈ చిత్రం ఇది నాలుగో బయోపిక్. 

సంబంధిత వర్గం
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.