(Local) Wed, 28 Jul, 2021

దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....

October 30, 2019,   5:31 PM IST
Share on:
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....

సామాన్యుడి నుండి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఎంతో చక్కగా జరుపుకునే పండుగ దీపావళి....అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ దీపావళి వేడుకలకు బాలీవుడ్‌కి చెందిన ఎందరో సెలబ్రిటీస్ హాజరయ్యారు. అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ఆమె లెహంగాకు దీపాల మంట అంటుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న షారుక్ ఖాన్ వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశాడు. అర్థరాత్రి 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

అర్చన తన కూతురితో కలిసి గార్డెన్‌లో ఉన్నప్పుడు అక్కడున్న దీపాల మంట ఆమె లెహెంగాకు అంటుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆమె కేకలు వేస్తుంటే అక్కడున్న మిగతా గెస్ట్‌లకు ఏం చేయాలో తోచలేదు. కానీ, షారుఖ్ మాత్రం సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆమె వద్దకు వెళ్లి తన జాకెట్‌తో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్, అర్చనలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే దగ్గర్లోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. షారుఖ్ చూపిన చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు. షారుఖ్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా అని కామెంట్లు పెడుతున్నారు

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...
మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.