(Local) Mon, 12 Apr, 2021

సురేందర్ రెడ్డి పైనే అందరి చూపు!!

October 06, 2019,   8:33 PM IST
Share on:
సురేందర్ రెడ్డి పైనే అందరి చూపు!!

2005లో కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. అయితే కిక్, ధృవ లాంటి మూవీస్ కి దర్శకత్వం వహించిన సురేందర్ చేతిలో చారిత్రాత్మక చిత్రాన్ని పెడితే.. ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నారు. అసలు సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాకి డైరెక్టరా అనుకుంటూ షాకయినవాళ్లు కూడా ఉన్నారు... పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. అయితే సైరా మేకింగ్ వీడియోస్, ట్రైలర్ విడుదలయ్యాకే సురేందర్ రెడ్డి సత్తా చాలావరకు బయటికి వచ్చింది. తాజాగా సై రా సినిమా కూడా హిట్ టాక్ తో థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. సురేందర్ రెడ్డి తన శక్తి మేర సైరా సినిమా కోసం కష్టపడ్డాడు. యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించడంలోనూ, పాత్రలను మలిచిన తీరుని, చిరులోని హీరోయిజాన్ని చూపించడంలోనూ సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు మెచ్చేలా కాదు.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించాడు. దీంతో సురేందర్ రెడ్డి తో సినిమాలు చేయడానికి హీరోలు లైన్ లో వున్నారు.
 

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.