(Local) Mon, 26 Aug, 2019

కళాతపస్విని పరామర్శించిన.....సీఎం కేసీఆర్

August 12, 2019,   2:21 PM IST
Share on:

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ను గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అప్పుడప్పుడు మాత్రమే బయటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పరామర్శించారు. ఈ సంధర్భంగా దర్శకుడు విశ్వనాథ్ సినిమాలో ఓ పాటకు సంబంధించిన సాహిత్యంపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని విశ్వనాథ్ చెప్పాడు. అనంతరం దర్శకుడు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌లో సాహిత్యంతోపాటు పలు కోణాలు ఉన్నాయని,ఇన్ని కోణాలు సీఎం కేసీఆర్‌లో ఉన్నాయని తాను ఊహించలేదని చెప్పారు. ఈనేపథ్యంలోనే చిన్నప్పుడు ఉపాధ్యాయుడు చెప్పిన పద్యాన్ని సీఎం వివరించడం చాల అశ్చర్యాన్ని కల్గించిదని అన్నారు. ఈ సంధర్భంగా సీఎం మాటలు వింటే తనకు అనందం కల్గించిందని విశ్వనాథ్ చెప్పారు. తన అజ్ఞాత అభిమానిని అని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆ మాట తనకెంతో గర్వకారణం అనీ ప్రసిద్ధ దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. 

సంబంధిత వర్గం

త్వరలో సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.