(Local) Thu, 25 Feb, 2021

'గగన వీధిలో' రేపు.......

September 04, 2019,   4:05 PM IST
Share on:
'గగన వీధిలో' రేపు.......

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, కన్నడ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్మీకి'. తమిళ సూపర్ హిట్ సినిమా 'జిగర్తాండ'  రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, జర్రా జర్రా సాంగ్ మాస్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ వాల్మీకి చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. కాగా మూవీ రిలీజ్ టైమ్ దెగ్గర పడుతుండంతో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్ ని వేగవంతం చేస్తోంది. తాజాగా కొద్దిసేపటి క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసారు. ''వనమాలి గారు రాసిన అద్భుతమైన సాహిత్యం నుండి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా వెలువడిన 'గగన వీధిలో' లో అనే లిరికల్ సాంగ్ ని సెప్టెంబర్ 5న సాయంత్రం 5గంటల కి విడుదల చేస్తునట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ  సినిమాలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అతిధి పాత్రలో కనిపించనున్న విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ సినిమాలో అధర్వ దర్శకుడు అవ్వాలనుకునే పాత్రలో కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ డైరెక్టర్ ను కలిసే సీన్ లో సుకుమార్ కనిపించనున్నారు.

సంబంధిత వర్గం
రంగమార్తాండలో బ్రహ్మీ లుక్...
రంగమార్తాండలో బ్రహ్మీ లుక్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.