(Local) Thu, 05 Aug, 2021

'గ్యాంగ్‌ లీడర్‌’ నుండి రెండో పాట విడుదల....

August 16, 2019,   6:33 PM IST
Share on:
'గ్యాంగ్‌ లీడర్‌’ నుండి రెండో పాట విడుదల....

ఈ మధ్య చిత్ర సీమలో కొత్త సినిమా వస్తోంది అంటే చాలు దానికి సంబంధించి ప్రమోషన్స్ సరికొత్త రీతిలో నిర్వహించి అభిమానులని ఆకట్టుకోవడం ట్రెండ్ గా మారింది. తాజాగా నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘గ్యాంగ్‌ లీడర్‌’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి రెండో పాట రిలికర్ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటను నాని తన కారులో ప్రయాణిస్తూ సింగర్ అనిరుద్ కి కాల్ చేసి అని హోయ్‌నా రెడీన అని అడగడంతో విన్నూతంగా ఈ లిరికల్ సాంగ్ ని ప్రదర్శించారు చిత్ర యూనిట్. వీడియోలో పాట... ‘వేరే కొత్త భూమిపై ఉన్నానా..ఎదో వింత రాగమే విన్నానా.హోయ్‌నా హొయ్ నా’ అంటూ అనిరుధ్, ఇన్నో జెంగా కలిసి పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ,వెన్నెల కిషోర్, సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్.

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.