(Local) Wed, 23 Sep, 2020

ట్రెండింగ్ లో  'సరిలేరు నీకెవ్వరు' సాంగ్....!

August 16, 2019,   2:53 PM IST
Share on:
ట్రెండింగ్ లో  'సరిలేరు నీకెవ్వరు' సాంగ్....!

'మహర్షి' సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ కెరీర్ జోరు మీద సాగుతోంది. తాజాగా మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో  'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ టైటిల్ సాంగ్  ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటలో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించారు. అంతేకాక ఈ పాట యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా యంగ్ హీరోయిన్ రష్మిక మందాన నటిస్తుంది. ఇక, 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.