(Local) Tue, 02 Mar, 2021

సూపర్ స్టార్ మూవీ ఓవర్సీస్ రైట్స్....

October 12, 2019,   1:23 PM IST
Share on:
సూపర్ స్టార్ మూవీ ఓవర్సీస్ రైట్స్....

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మహేష్ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నికెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ సరసన రష్మిక నటిస్తోంది. అంతేకాక ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అలనాటి హీరోయిన్ 'విజయశాంతి' నటిస్తున్నారు. వెండితెరపై చాల గ్యాప్ తర్వాత ఈ లేడి సూపర్ స్టార్ తన సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓవర్సీస్ లో మహేష్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓవర్సీస్ లో పోటీపడి ప్రముఖ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ మరోసారి మహేష్ సినిమా హక్కుల్ని దక్కించుకుంది.

గతంలో యూఎస్ఏ లో అతడు – పోకిరి – భరత్ అనే నేను – అలాగే మహర్షి వంటి హిట్ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ మళ్ళీ ఇప్పుడు సరిలేరు నికెవ్వరు హక్కుల్ని దక్కించుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. SVC ప్రొడక్షన్ – GMB ఎంటర్టైన్మెంట్స్ – ఏకే ఎంటర్టైన్మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఇక ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్,  బ్రహ్మాజీ వంటి సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.