(Local) Wed, 23 Sep, 2020

సూపర్ స్టార్ కోసం మళ్ళీ ఆ కోటని నిర్మించారు...

August 26, 2019,   3:53 PM IST
Share on:
సూపర్ స్టార్ కోసం మళ్ళీ ఆ కోటని నిర్మించారు...

కొండారెడ్డి బురుజు ఎక్కడో చూసినట్టు, విన్నట్టు ఉంది కదా.... కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉన్న ఒక కోట.  కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి దీనిని "ఎర్ర బురుజు" అని కూడా అంటారు.... ఇపుడెందుకు ఈ విషయం అనుకుంటున్నారా.... అప్పట్లో ఈ కొండారెడ్డి బురుజు దెగ్గర చాల షూటింగ్స్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ కొండారెడ్డి బురుజు అనేది 2003లో సూపర్ స్టార్ మహేష్, భూమిక నటించిన 'ఒక్కడు' సినిమా ద్వారా బాగా ఫేమస్ అయింది. అయితే తాజాగా కొండారెడ్డి బురుజు ను హైదరాబాద్ కి షిఫ్ట్ చేసారంట. కోటని షిఫ్ట్ ఎలా చేస్తారు....అనుకుంటున్నారా... సూపర్ స్టార్ మహేష్ అని రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా మూడో  షెడ్యూల్ కోసం రెడీ అయ్యిందని అంటున్నారు.

అయితే ఈ మూడో షెడ్యూల్ కోసం కొండారెడ్డి బురుజు దెగ్గర చేయవలసి ఉంది. అయితే ఒక్కడు టైం లో ఆయన కొత్త హీరో కావడంతో, క్రౌడ్ కంట్రోల్ విషయంలో పెద్దగా సమస్య రాలేదు. ఇప్పుడు అతను సూపర్ స్టార్, ఆ బురుజు వద్ద ఇప్పుడు షూటింగ్ సాధ్యం కాదు. అందుకే మహేష్‌ నటిస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం కొండా రెడ్డి బురుజు సెట్ నే నిర్మించారు.  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మించినట్టు సమాచారం.  ఇక నేటి నుండి ఈ సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే జరగనుందని అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మేజర్‌ అజయ్‌కృష్ణ అనే ఓ మిలటరీ అధికారి పాత్రలో మహేష్‌ కనిపించనున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.