(Local) Thu, 21 Nov, 2019

13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న....హీరోయిన్

August 12, 2019,   5:59 PM IST
Share on:
13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న....హీరోయిన్

2006లో నాయుడమ్మ చిత్రంలో కనిపించిన రాములమ్మ ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. మళ్ళి 13 సంవత్సరాల తర్వాత తెలుగు తెరపై కనిపించనుంది. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరోయిన్ విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రాబోతున్నారు.  ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేశ్‌బాబు ఇంట్రోను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్‌ వేసుకున్నారంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇట్స్‌ మేకప్‌ టైమ్‌ ఫర్‌ విజయశాంతి గారు’ అంటూ అనిల్‌ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజమ్‌ అంటూ.. విజయశాంతి రీ ఎంట్రీకి స్వాగతం తెలిపాడు. అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ‘వెల్‌కమ్‌ మేడమ్‌’ అంటూ అనిల్‌ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశాడు. కాగా విజయశాంతి కూడా వారికీ సమాధానమిస్తూ  'అనిల్ రావిపూడి గారు, మహేష్ బాబు గారు నన్ను స్వాగతించినందుకు నా ధన్యవాదాలు అంటూ,  వైఖరి అనేది వ్యక్తి యొక్క ఎత్తు. వాతావరణం మారవచ్చు కానీ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ. రీట్వీట్ చేసింది. ఒకప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా  అభిమానులను అలరించిన విజయశాంతి గత కొన్నేళ్లుగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. 

సంబంధిత వర్గం
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.