(Local) Mon, 18 Nov, 2019

‘ప్రస్థానం’ ట్రైలర్ విడుదలైంది.....

August 29, 2019,   6:22 PM IST
Share on:
‘ప్రస్థానం’ ట్రైలర్ విడుదలైంది.....

2010లో దేవ కట్టా దర్శకత్వంలో సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ నటించిన ప్రస్థానం తెలుగులో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ దేవ కట్టా ఇదే ప్రస్థానాన్ని రీమేక్ చేసి హిందీలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దేవా కట్టా ఈ సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. సంజయ్ దత్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రస్థానం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు....  ‘తాతయ్య ఎవరినైనా చంపడం అంత తప్పా అని ఓ పిల్లాడు అడగ్గా..చాలా తప్పు అంటూ ఒకరు సమాధానం ఇస్తారు. మరి రావణుడిని రాముడు ఎందుకు చంపాడని ప్రశ్నించగా..రావణుడు చెడ్డవాడు కాబట్టి అంటూ జవాబిస్తారు. అయితే చంపడం కూడా తప్పు కాదు కదా’ అంటూ చిన్నారి సంభాషణలతో ప్రారంభమయే ట్రైలర్ ఆలోచింపజేసే విధంగా సాగుతోంది. సంజయ్ దత్ సెటిల్డ్ పర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్, చుంకీ పాండే, అలీ ఫాజల్, సత్యదేవ్ దూబే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రస్థానం రిలీజ్ కానుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. దేవ కట్టా స్టోరీలోని సోల్ మిస్ కాకుండా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంజయ్ దత్ సమర్పణలో ఆయన భార్య మాన్యతా దత్ నిర్మిస్తుంది.

సంబంధిత వర్గం
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
కేజీఎఫ్‌-2 షూటింగ్‌ ఆగిపోయింది.....
కేజీఎఫ్‌-2 షూటింగ్‌ ఆగిపోయింది.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.