
ఈ మధ్య చాలా మంది ప్రేక్షుకులు బడా హీరో సినిమాలే కాకుండా చిన్న చిత్రాలని కూడా ఆదరించడం చూస్తూనే ఉన్నాం. కథ బాగుంటే సినిమా హిట్ అవ్వడమే కాకుండా అందులోని నటి నటులపై కూడా అభిమానం పెంచుకుంటున్నారు. 2014లో “హృదయ కాలేయం” చిత్రం ద్వారా పరిచయమైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా అభిమానులు ఉన్నారు అనడంలో అతిశోయక్తి లేదు. తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన “కొబ్బరి మట్ట” మూవీ మీద తమ ప్రాంతంలో విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఓ అభిమాని సెల్ టవర్ ఎక్కాడు కలకలం సృష్టించాడు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23) బైకు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. సంపూర్ణేశ్ బాబుకు అభిమాని అయిన రెడ్డెప్ప, తమ ప్రాంతంలో కొబ్బరిమట్ట సినిమా విడుదల కాకపోవడంతో అసహనానికి లోనయ్యి గత శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంపూ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్, నిర్మాత సాయి రాజేశ్ నీలంలను డిమాండ్ చేశాడు.
అయినా వారు స్పందించకపోవడంతో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు రెడ్డప్ప స్థానిక అయోధ్యనగర్ లోని సెల్ టవర్ ఎక్కేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ సునీల్‌కుమార్ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని రెడ్డెప్పతో ఫోన్ లో మాట్లాడారు. కిందకు దిగాలని పోలీసులు కోరినా పట్టించుకోని రెడ్డెప్ప సాయంత్రం 6 గంటల వరకూ అక్కడే ఉండిపోయాడు. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెడ్డప్ప నానాహంగామా చేశాడు. ‘మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు..మా సంపూర్ణేష్‌బాబు చిత్రాన్ని ఎందుకు విడుదల చేయరు’ అని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు రెడ్డెప్ప చిన్నమ్మ కుమారుడు ప్రశాంత్‌ను టవర్ ఎక్కించి కిందకు దింపే ప్రయత్నం చేశారు. చివరికి రెడ్డెప్పను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెడ్డెప్ప మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

వరద బాధితులకు విరాళం అందించిన బర్నింగ్ స్టార్...!

రివ్యూ: కొబ్బరి మట్ట
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.