(Local) Fri, 17 Jan, 2020

వరద బాధితులకు విరాళం అందించిన బర్నింగ్ స్టార్...!

August 13, 2019,   5:10 PM IST
Share on:
వరద బాధితులకు విరాళం అందించిన బర్నింగ్ స్టార్...!

ప్రకృతి వైపరీత్యాలకు ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వైపరీత్యాల వాళ్ళ చాల మంది అవస్థలు పడుతుంటారు. తాజాగా భారీ వర్షాలకు కన్నడ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.  ఇళ్లు కూలిపోయి.. ఉండేందుకు వీలు లేక అవస్థలు పడుతున్నారు. చుట్టూ నీరు నిండిపోవడంతో తినేందుకు తిండి కూడా సరిగా లభించడంలేదు. చాలా మంది దాతలు తమకు తోచినంతగా సాయం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అందులో సెలబ్రిటీస్ కూడా పాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కన్నడ వాసులకు టాలీవుడ్‌లో బర్నింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తన వంతుగా విరాళం ప్రకటించారు. హృదయ కాలెయం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సంపూ తనకి హృదయం ఉందని నిరూపించుకున్నాడు వరద భాదితులకు సహాయం అందించి. సంపూ తన ఫేస్‌బుక్‌లో ఖాతాలో  ఓ పోస్ట్ చేశారు కర్ణాటక వాసుల ఇబ్బందులు చూసి తాను తట్టుకోలేకపోతున్నాని అందుకోసం తన తరుపున వారి కోసం రూ. 2 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. హృదయ కాలెయం సినిమా నుంచి అక్కడి వారు తనను ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. అందుకే తన వంతుగా సాయం ప్రకటిస్తున్నానని వెల్లడించారు.

 

సంబంధిత వర్గం
బర్నింగ్ స్టార్ కోసం సెల్ టవరెక్కిన బర్నింగ్ ఫ్యాన ...
బర్నింగ్ స్టార్ కోసం సెల్ టవరెక్కిన బర్నింగ్ ఫ్యాన ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.