(Local) Sat, 24 Jul, 2021

మామ బర్త్ డే లో కోడలి డ్రెస్ హాట్ టాపిక్…..?

August 31, 2019,   5:17 PM IST
Share on:
మామ బర్త్ డే లో కోడలి డ్రెస్ హాట్ టాపిక్…..?

టాలీవుడ్ “కింగ్” నాగార్జున తన 60వ పుట్టిన రోజును స్పెయిన్‌లోని ఐబిజా ఐల్యాండ్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో నాగ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మన్మధుడి కోడలు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన హాట్ లుక్‌తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మామ నాగార్జున బర్త్ డే సందర్భంగా సరికొత్త ఫ్యాషన్‌తో అందరినీ ఆకర్షించింది. నాగ చైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల..అందరూ స్పెయిన్ అందాలను ఆస్వాదిస్తున్నారు. నాగ్ బర్త్‌డేకు నాలుగు రోజుల ముందే చై-సామ్ దంపతులు స్పెయిన్ వెళ్లిపోయి ఏర్పాట్లు చేశారు.  మామ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన సిక్స్ ప్యాక్‌తో పూల్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన సామ్.. నాగ్ బర్త్‌డే పార్టీలో ఏకంగా పింక్ కలర్ డ్రెస్‌లో బార్బీ గర్ల్ మాదిరి అందంగా మెరిసింది. గురువారం జరిగిన నాగ్ పుట్టినరోజును అక్కినేని కుటుంబం ఇబిజాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ అకేషన్‌లో సామ్ ప్రత్యేకమైన లుక్‌లో తళుక్కుమంది. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించారు. ఆ డ్రెస్ ధర రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం.  ఆ ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.