(Local) Sun, 20 Jun, 2021

నీ ప్రేమకు బందీనయ్య...సమంత

October 06, 2019,   11:15 PM IST
Share on:
నీ ప్రేమకు బందీనయ్య...సమంత

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ జోడిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత. ఈ ఇద్దరి జోడిని చూసి కేవలం అక్కినేని అభిమానులే కాదు చాలా మందికి ఈ జోడి అంటే ఎనలేని ఇష్టం... ఈ అందమైన కపుల్‌ చై-సామ్‌ ల  వివాహం అయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. ఆదివారం వీరి వివాహ వార్షికోత్సం సందర్భంగా పలువరు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కూడా తన వివాహ జీవితానికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. చైతూతో కలిసి గడిపిన కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. చైతుతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు.అంతేకాకుండా ఈ రెండేళ్లలో తమ మధ్య బంధం మరింత దృఢంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అలాగే తమ ప్రేమ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలుగులో సమంత నటించిన తొలి చిత్రం ‘ఏం మాయ చేశావే’లో చైతూతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్‌ 6న వీరి వివాహం జరిగింది. పెళ్లైనా తరువాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే చై-సామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మజిలీ మంచి హిట్‌ అందుకుంది. అలాగే సమంత కీలక పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. 

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.