(Local) Sun, 20 Jun, 2021

టెర్రరిస్ట్ గా కనపడనున్న సమంత...

October 12, 2019,   2:44 PM IST
Share on:
టెర్రరిస్ట్ గా కనపడనున్న సమంత...

అక్కినేని సమంత ఈ పేరుకి పరిచయం అవసరం లేదు...2010లో ఏ మాయ చేశావే మూవీ ద్వారా తెలుగులోకి తెరంగ్రేటాం చేసిన సామ్ ఆ మూవీలో తనతో జోడీ కట్టిన అక్కినేని నాగ చైతన్య తోనే జీవితం పంచుకొంటోంది. సాధారణంగా పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్‌ స్లో అవుతుంది. కానీ సమంత కెరీర్‌ మాత్రం పెళ్లి తరువాత మరింతగా ఊపందుకుంది. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ కూడా స్టార్ హీరోలు ఈమెతో నటించడానికి సై అంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం ప్రత్యేకంగ పాత్రలు రాస్తున్నారు. సామ్ గ్లామర్‌ రోల్స్‌ తో పాటు ప్రయోగాత్మక పాత్రల్లో కూడా అలరిస్తోంది. ఇటీవల వరుసగా వచ్చిన యూ టర్న్‌, మజిలీ, ఓ బేబీ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకుంది. వెండితెరపై టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న ఈ బ్యూటీ త్వరలో డిజటల్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత నటించనుంది. కథ నచ్చడంతో నెగిటివ్ రోల్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది. ఇందులో సామ్ ఎన్నడూ చేయని విధంగా నెగటివ్ రోల్ లో కనిపించనుంది. టెర్రరిస్ట్ గా కనిపించబోతోంది. ఇప్పటి వరకు అలాంటి పాత్ర తాను ఎప్పుడూ చేయకపోవడంతో స్యామ్ చాలా ఆసక్తిగా కనపరుస్తోందని వినికిడి. మొత్తానికి చూడాలిక.. సమంత అక్కినేని విలన్ వేషాలు ఎలా ఉండబోతున్నాయో..?

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
నీ ప్రేమకు బందీనయ్య...సమంత
నీ ప్రేమకు బందీనయ్య...సమంత

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.