(Local) Mon, 17 May, 2021

అక్కినేని వారి కోడలి స్టంట్...వీడియో వైరల్

August 22, 2019,   6:33 PM IST
Share on:
అక్కినేని వారి కోడలి స్టంట్...వీడియో వైరల్

అక్కినేని వారి కోడలిగా మాత్రమే కాకుండా, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ని చ‌విచూసింది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన స‌మంత వ‌ర్క్ విష‌యంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఆ డేడికేషన్స్ తో సినిమాలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యక ఇమేజ్ తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇటీవలే “ఓ బేబీ” చిత్రంతో ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత.  ఫిట్‌నెస్ కోసం కూడా చాలా శ్ర‌మ‌ప‌డుతుంటుంది. తాను జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోల‌ని అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తూ ఉండే స‌మంత రీసెంట్‌గా ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని ప‌ట్టుకొని రెండు చేతుల‌తో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. స‌మంతలో దాగి ఉన్న సామ‌ర్ద్యాన్ని చూసి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి సామ్.. ‘కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి .. మీ సామర్థ్యం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.’ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆమె వీడియోని చూసి షాక్ అయిన‌ న‌మ్ర‌త‌, కాజ‌ల్‌, పూజా హెగ్డే, సుశాంత్ త‌దిత‌ర ప్ర‌ముఖులు కామెంట్స్ పెట్టారు. స‌మంత అమేజింగ్ అని ప్ర‌శంసించారు.

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
ఫైట్ సీక్వెన్స్‌లో గాయపడిన స్టార్ హీరో..!
ఫైట్ సీక్వెన్స్‌లో గాయపడిన స్టార్ హీరో..!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.