(Local) Mon, 27 Sep, 2021

నవిష్క పాపతో మెగాస్టార్, సుప్రీమ్ హీరో

October 22, 2019,   1:15 PM IST
Share on:
నవిష్క పాపతో మెగాస్టార్, సుప్రీమ్ హీరో

పిల్లలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి...అందులోను సినీ స్టార్స్ తమ చిన్నారులతో ఆడుతూ..పాడుతూ అల్లరి చేసే సన్నివేశాలు వారినే కాకుండా వారి అభిమానులకి సైతం ఎంతో ఆనందాన్ని పంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు...తాజాగా ఇలాంటి ఓ సన్నివేశం మెగా ఫ్యామిలీ లో చోటు చేసుకుంది. మెగాస్టార్ తనయ శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ దంపతులకి గత ఏడాది క్రిస్మస్ పండుగ రోజున ఆడ పిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పాపకు ‘నవీష్క’ అని నామకరణం చేసినట్టు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా ఈ చిన్నారి నవీష్క తో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, తాత మెగాస్టార్ ఆడుకుంటున్న పిక్ వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారాల పట్టి నావిష్కలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ‘నవిష్క పాప స్మైల్ కి ఫైటింగ్, కిల్లింగ్, డైయింగ్ వంటివి ఏవి చేసినా తక్కువే’ అంటూ ప్రక్కన కూర్చుకున్న చిరంజీవితో కలిసి సరదాగా కామెంట్ చేస్తూ ఒక పిక్ పోస్ట్ చేసారు సాయి తేజ్. కాగా ప్రస్తుతం ఈ పిక్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది…!!

సంబంధిత వర్గం
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
మోడీతో సైరా...
మోడీతో సైరా...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.