(Local) Mon, 26 Aug, 2019

‘నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే...సాహో సాంగ్

August 02, 2019,   11:33 PM IST
Share on:

ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం "సాహు". ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్ , సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల‌ ఏ చోట నువ్వున్నా అనే సాంగ్‌కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు. కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించిన ఈ పాట‌ని శేషాద్రి, తుల‌సీ కుమార్ ఆల‌పించారు. ఈ పాట‌లో ప్ర‌భాస్ లుక్ అదిరింది. విజువ‌ల్స్ కూడా అందంగా ఉన్నాయి. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. అందులో...‘నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే... నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ విడుదలైంది.  గురు రంధావా మ్యూజిక్ అందించిన సాంగ్ వినడానికి వినసొంపుగా ఉన్నది. సాంగ్ లో కొన్ని చోట్ల పదప్రయోగాలు చేశారు.  మిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే.. కన్నులు అలిసేలా నీతో ఉంటాలే పదాలు కొత్తగా ఉండటమే కాకుండా మంచు కొండలతో పాటు, కళ్ళు చెదిరే సెట్స్ లో సాంగ్ ను షూట్ చేశారు ఈ పాటని. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ‘సాహో’ను యువీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సుజిత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మాతలు.అంతేకాక సాహో చిత్ర ఆడియో వేడుక‌ని దేశంలోని ముఖ్య ప‌ట్ట‌ణాల‌లో జ‌ర‌పనున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే . ఆగ‌స్ట్ 17న హైద‌రాబాద్‌లో, 21న కొచ్చిన్‌లో, 25న బెంగ‌ళూర్‌లో, 27న ముంబైలో ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.  ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.`బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో `సాహో`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సంబంధిత వర్గం

తెలంగాణాలో ప్రభాస్ సాహో కి చుక్కెదురు....?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.