(Local) Wed, 21 Aug, 2019

అరుణ్ విజ‌య్ లుక్.....'సాహో'

August 06, 2019,   2:45 PM IST
Share on:

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర బృందం రోజుకొక సర్ప్రైజస్ ఇస్తున్నారు డార్లింగ్ అభిమానులకి. నిన్న సాహో మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న 'నీల్ నితిన్ ముకేశ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ని ‘ది ఎండ్ డసన్ట్ ఆన్సర్ ఎవ్రిథింగ్’ అనే క్యాప్షన్ తో విడుదలచేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ మూవీ నుండి  ప్రభాస్ బాక్సింగ్ శిక్షణ పొందుతున్న ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి అరుణ్ విజ‌య్ పాత్రని విశ్వాంక్ గా పరిచయం చేస్తూ దానికి సంబందించిన ఓ పోస్టర్ ని విడుద‌ల చేసారు. హెలికాఫ్ట‌ర్ నుండి దిగి సీరియ‌స్‌గా న‌డుచుకుంటూ వ‌స్తున్న అరుణ్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు

సంబంధిత వర్గం

స్టార్ హీరోస్ కలిసి ఒక ఫ్రేమ్ లో.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.