(Local) Wed, 21 Aug, 2019

‘సాహో’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్...

August 08, 2019,   5:34 PM IST
Share on:

రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం 'సాహో'. బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైనే ప్రతి ఒక్కరి చూపు... ప్రమోషన్స్‌లో భాగంగా రోజుకో అప్‌డేట్‌తో చిత్ర యూనిట్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ తరుణంలో అత్యంత కీలకమైన ‘సాహో’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారైంది.

ఆగస్టు 10న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు గా యూవీ క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసి ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సాహో ఈ నెల 30న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సాహో టీజర్‌ ఆన్‌లైన్‌ వ్యూస్‌లో రికార్డ్‌ సృష్టించగా ట్రైలర్‌ మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంతేకాక త్వరలో సాహో గేమ్ కూడా మార్కెట్‌లోకి రానుంది.

సంబంధిత వర్గం

స్టార్ హీరోస్ కలిసి ఒక ఫ్రేమ్ లో.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.