(Local) Mon, 25 Oct, 2021

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్....?

August 14, 2019,   5:56 PM IST
Share on:
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్....?

యంగ్  రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సాహో'. ఇటీవలే విడుదలై ఈ చిత్ర ట్రైలర్  సంచలనాలు సృష్టించడమే కాకుండా యూట్యూబ్ లో కూడా ట్రేండింగ్ అవుతోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తూన్న సాహో మీద అంచనాలను భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా  ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో వేడుకను చేయనున్నారట చిత్ర యూనిట్. ఈ వేడుక కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండటం వల్ల  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరవుతుండంతో ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో ప్లాన్ చేస్తున్నారు సినిమా బృందం. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.