(Local) Mon, 27 Sep, 2021

తొలి రోజు అదరగొట్టిన సాహో…

August 31, 2019,   7:41 PM IST
Share on:
తొలి రోజు అదరగొట్టిన సాహో…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా రెండోసారి సెంచరీ బాదాడు. బాహుబలి2తో తొలిరోజు 120 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు ప్రభాస్. తాజాగా మరోసారి సాహో సినిమాతో తొలిరోజే 100 కోట్లు రాబట్టి సత్తా చాటాడు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందిన ‘సాహో’ హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ మూవీకి తొలిరోజే నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ కావడంతో వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో అంచ‌నాలు తారుమారయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఓపెనింగ్స్ వచ్చినా.. బాలీవుడ్, ఓవర్సీరీస్లో మాత్రం అనుకన్నంత మేర వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీ బాలీవుడ్ లో తొలి రోజు సులభంగా 50 కోట్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, నెగిటీవ్ టాక్ తోపాటు రివ్యూస్ కూడా దారుణంగా ఇవ్వడంతో వసూళ్లు తగ్గాయి. అయినా.. ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్‌తో పాటుగా చిత్రానికి ల‌భించిన‌ హైప్‌, అడ్వాన్స్ బుక్సింగ్స్ వ‌లన తొలి రోజు 24.40 కోట్ల వ‌సూళ్ళు సాధించింద‌ని క్రిటిక్ త‌ర‌ణ్ ఆదర్శ్ తెలిపారు. బాలీవుడ్ లో ఈ ఏడాది తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 3 సినిమాగా సాహో నిలిచింది. సల్మాన్ ఖాన్ ‘భార‌త్’ చిత్రం తొలి రోజు 42.30 కోట్లు సాధించి టాప్‌లో నిలువగా… ఆ త‌ర్వాత మిష‌న్ మంగ‌ళ్ తొలి రోజు 29.16 కోట్లు వసూళ్లు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక, ప్రపంచవ్యప్తంగా తొలి రోజు ‘సాహో’ 100 కోట్ల మార్క్ అందుకుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిణంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్‌, లాల్‌, అరుణ్‌విజయ్‌, నీల్‌నితిన్‌, మందిరాబేడిలు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.