(Local) Fri, 17 Sep, 2021

ప్రబాస్ ని ‘బ్యాడ్ బాయ్’ అంటున్న....బాలీవడ్ భామ

August 20, 2019,   8:20 PM IST
Share on:
ప్రబాస్ ని ‘బ్యాడ్ బాయ్’ అంటున్న....బాలీవడ్ భామ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్  భామ శ్రద్ధ  కపూర్ హీరోయిన్ గా తెరకెక్కతున్న చిత్రం 'సాహో'. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో  300 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యాడ్ బాయ్ అంటూ కొత్త సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాట హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ ఆడిపాడుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక, నిన్న రామోజీ ఫిల్మీ సిటీలో భారీ లెవల్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న బజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాను ఎప్పుడెప్పడు చూధ్దామా అని అభిమానులతో పాటు సినీ ప్రముఖలు ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి. 

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.